- ఇంకెంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు..?
- రూపాయి సింబల్ మార్పుపై అన్నామలై ఆగ్రహం..
- సీఎం స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు..

Annamalai: తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇప్పటికే జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై వివాదం నడుస్తోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ రుద్దే ప్రయత్నం చేస్తో్ందని సీఎం స్టాలిన్‌తో సహా డీఎంకే పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం ‘‘రూ’’ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ తమిళుడు రూపొందించి జాతీయ చిహ్నాన్ని డీఎంకే విస్మరిస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘2025-26 సంవత్సరానికి డీఎంకే ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ ఒక తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని భర్తీ చేసింది, దీనిని మొత్తం భారతదేశం స్వీకరించి మన కరెన్సీలో చేర్చింది. ఈ చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్, మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు. స్టాలిన్ మీరు ఎంత తెలివతక్కువారు అవుతారు.?’’ అని అన్నామలై ట్వీట్ చేశారు.
Read Also: Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్..
తమిళనాడు సీఎం రూపాయి చిహ్నాన్ని మార్చడంపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా కూడా విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఉదయ కుమార్ ధర్మలింగం ఒక భారతీయ విద్యావేత్త ,డిజైనర్, మాజీ DMK MLA కుమారుడు, ఆయన భారత రూపాయి చిహ్నాన్ని రూపొందించారు, దీనిని భారత్ ఆమోదించింది. ముఖ్యమంత్రి MK స్టాలిన్ తమిళనాడు బడ్జెట్ 2025-26 పత్రం నుండి ఆ చిహ్నాన్ని తొలగించడం ద్వారా తమిళులను అవమానిస్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది..?’’ అని అన్నారు.
తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పత్రంలో అధికారిక రూపాయి చిహ్నానికి బదులుగా ‘‘రూ’’ అనే తమిళ అక్షరాన్ని చేర్చారు. ఇది ‘‘రూబాయి’’(తమిళంలో రూపాయలు) నుంచి వచ్చింది. ఈ చర్య మరోసారి భాషా చర్చని లేవదీసింది. రాజకీయాల కోసమే డీఎంకే ప్రభుత్వం, ఎంకే స్టాలిన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తమిళనాడుకు చెందిన విద్యావేత్త ఉదయ్ కుమార్ రూపాయి చిహ్నాన్ని రూపొందించారు. దీనిని 2010లో భారత ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది.