Telangana Anganwadi Jobs 2025 : తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరో గుడ్‌న్యూస్. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హైలైట్:
- తెలంగాణ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్
- 14236 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే యోచన

గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిని పలువురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీవిరమణ చేయనున్నందున ఆ పోస్టులనూ నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి
గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10 తరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది. ఇదే ఇక్కడ వర్తింప చేసే అవకాశం ఉంది.
TGSRTC సంస్థలోనూ 3038 డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రణాళిక!
TGSRTC Driver Conductor Recruitment 2025 : తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని TGSRTC యాజమాన్యం భావిస్తోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల పలు వేదికల్లో RTC రిక్రూట్‌మెంట్‌పై అప్డేట్ ఇచ్చారు. ఇటీవల మంత్రి మాట్లాడుతూ.. TGSRTC సంస్థ ఆధ్వర్యంలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని.. మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో ఆర్‌టీసీ ఉద్యోగాలు భర్తీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.