Andhra Pradesh land disputes: ప్రైవేటు భూములేవీ 22ఏలో ఉండకూడదు

Written by RAJU

Published on:

ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలి : మంత్రి అనగాని

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22 ఏలో ఉండకూడదనేదే ప్రభుత్వ ఆశయమని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నిర్దేశించారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ప్రజలకు భూమి అనేది సెంటిమెంట్‌తో కూడుకున్న వ్యవహారమని, పేదలకైతే అది ఒక భరోసా అని తెలిపారు. ప్రజల భూ వివాదాల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. జిల్లాల్లో ప్రత్యేకించి ఒక రియల్‌ఎస్టేట్‌ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, జిల్లా, రెవెన్యూ, మునిసిపాలిటీ, పంచాయతీ, పట్టణాభివృద్ధి సంస్థలు, బ్యాంకర్లు అందరూ ఈ కమిటీలో సభ్యులుగా ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఈ కమిటీ నెల, రెండు నెలలకోసారి సమావేశమై ఆయా జిల్లాల్లో ప్రభుత్వ భూముల వివాదాలు పరిష్కరించాలని కోరారు.ప్రజలే ముందు అనే నినాదంతో చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాల సాధన లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో సీఎం కార్యాలయం పనిచేస్తోందని, అదే తరహాలో జిల్లాస్థాయి సీఎంవోలుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు ఎంతో శక్తిమంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Updated Date – Mar 26 , 2025 | 05:01 AM

Subscribe for notification
Verified by MonsterInsights