Andhra Pradesh: 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 25 , 2025 | 03:53 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను ఏపీఎండీసీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హక్కులను గ్యారెంటీగా చూపించి రూ.9000 కోట్ల రుణాన్ని బాండ్ల రూపంలో సమీకరించేందుకు అనుమతించింది.

Andhra Pradesh: 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే

మైనింగ్‌ హక్కులు కూడా అప్పగింత

9 వేల కోట్ల రుణం కోసం కీలక నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకునే అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగిస్తూ గురువారం గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ ఉత్తర్వులు (జీఓ-69) జారీ చేశారు. ఈ హక్కులను గ్యారెంటీగా చూపించి ఏపీఎండీసీ రూ.9000 కోట్ల అప్పును బాండ్ల రూపంలో సేకరించేందుకు వెసులుబాటు లభించింది. ఆ రుణానికి గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు(జీఓ-33) జారీ చేసింది. ఇప్పుడు… తన పరిధిలోకి వచ్చిన 436 ఖనిజ లీజులు, మైనింగ్‌ హక్కులను ఏపీఎండీసీ తన ఆస్తులుగా చూపించి… అప్పు ఇచ్చే సంస్థకు గ్యారెంటీగా చూపించనుంది. ‘‘ఏపీఎండీసీ నమ్మకమైన డి బెంచర్‌ ట్రస్టీని నియమించుకొని, బాండ్లు జారీ చేయాల్సి వస్తే అందుకు ప్రతిగా ఆ ట్రస్టీకి 436 ఖనిజాల లీజు హక్కులు, మైనింగ్‌ హక్కులను బదిలీ చేయవచ్చు’’ అని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. ఈ మేరకు జిల్లాల వారీగా మైనింగ్‌ అధికారులు లీజు ఒప్పందాలు చేసుకోవాలని సర్కారు ఆదేశించింది. ‘‘లిఖితపూర్వక లీజు ఒప్పందాలు ముగిసిన తర్వాత ఆ మైన్‌ల నిర్వహణ బాధ్యత ఎండీసీ చూసుకుంటుంది’’ అని తెలిపింది.

Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ…

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date – Apr 25 , 2025 | 03:53 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights