Andhra Pradesh: మద్యం దుకాణంలో విచిత్ర పూజ.. భగవంతునికి మద్యం బాటిళ్లు నైవేద్యం.. ఎక్కడంటే.. – Telugu News | Wine Shop Unique Puja: Liquor Bottles Offered for Prayers in Eluru andhra pradesh

Written by RAJU

Published on:

భగవంతుడికి తోచింది సమర్పించుకుని కస్టాలు తీర్చమని కన్నీళ్లు తుడవమని కోరుకొని నాధుడు ఉండడు. ఏక ఇంట్లో పూజ చేసినా ఏంతో కొంత పంచదార దేవుడిదగ్గర పెట్టి రెండు అగరవత్తులు వెలిగిస్తాము. ఇక వ్యాపారసముదాయాల్లో బెల్లం, అటుకులు, అరటిపండ్లు ఇలా దేవుడికి భక్తి తో శక్తి కొద్దీ సమర్పించుకుంటారు. టెంకాయ కొట్టిన, పూలు, పాలు గుడికి తీసుకుని వెళ్లడం సంప్రదాయం, ఆచారం వంటివి పాటించటం లేదా మతగురువులు చెప్పిన విధానాలు అవలంభించటం చేస్తుంటారు. అయితే ఒక వ్యాపారి తన మద్యం వ్యాపారం బాగా సాగాలని కోరుతూ పూజలు చేస్తున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైన్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారం బాగా సాగాలని దేసుడిని కోరుతూ మద్యం బాటిళ్లు దేవుడిదగ్గర పెట్టి రోజూ పూజలు చేస్తున్నారు. దీంతో షాప్ కి వెళ్లిన వాళ్ళు  అది చూసిన వాళ్ళు ఏమిరా ఇది ..అని ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంతా చేసి మరి మంత్రాలు చదవాల్సి వస్తే .., ధూపం సర్పయామి కి బదులు జిన్ సమర్పయామి , వైన్ ఆవాహయామి , విస్కీ అభిషేకాయామి , రమ్ దర్శయామి అంటూ మంత్రాలు జల్లి … వచ్చిన వారికి ప్రసాదం పంచినట్లు మందు సైతం రెండు చుక్కలు లక్కీ డ్రాప్స్ పంచుతారేమో అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

ఇవి కూడా చదవండి

రైతులు తమ తొలిపంటలో కొంత ఆలయానికి ఇచ్చినట్లు దేవుడికి మద్యం బాటిళ్లు పెట్టడడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా చూసుకుని ఈ మద్యం షాప్ యజమాని దేవుడి ముందట లిక్కర్ సీసాలు ఉంచటం అందరూ విచిత్రం గా చెప్పుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification