Andhra Pradesh: పట్టపగలే వృద్ధురాలిపై దాడి.. అంతలోనే కళ్లుతిరిగి పడిపోయిన దొంగ.. కట్‌చేస్తే.! – Telugu Information | Theft in broad daylight assault on aged girl

Written by RAJU

Published on:

ఎమ్మిగనూరు పట్టణంలో గాంధీనగర్ లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. రాత్రి నుండి రెక్కి నిర్వహించిన దొంగ తెల్లవారుజామున మొదటి అంతస్తులో ఉన్న వృద్దురాలు బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ వృద్దిరాలిపై దాడి చేసి ఆమె మేడలా ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆ దొంగకు కళ్ళు తిరిగినట్టుగా అయింది..దాంతో మిద్దె పై నుండి అమాంతంగా కింద పడి స్పృహా కొల్పయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను అదుపులో తీసుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న దొంగను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దొంగ ఎమ్మిగనూరులోనే ఓ మంగలి దుకాణంలో పని చేస్తున్న మంగలి రాఘవేంద్ర గా గుర్తించారు. తాను జల్సాలకు అలవాటు పడ్డ రాఘవేంద్ర ఇలా ఈజీ మనీ కోసం ఇలాంటి దొంగతనాలు, అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కానీ, రాఘవేంద్ర మాత్రం తాను వృద్ధురాలి భర్త కు షేవింగ్ చేయటం కోసం వెళ్లనని చెప్పాడు. అక్కడ దొంగ పారిపోతుంటే పట్టుకోవడానికి వెళ్లి కింద పడ్డానని బుకాయించినట్టుగా పోలీసులు చెప్పారు. రాఘవేంద్ర తనపై దాడి చేసి గొలుసు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడని వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights