అమరావతి, మార్చి 31: ఏప్రిల్ నెలలో జరగనున్న జాతీయ యువ పార్లమెంటుకు ఏపీ నుంచి ముగ్గురు బాలికలు ఎంపికయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఈ నెల 28న యువజన సర్వీసులు- నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో విశాఖపట్నం నోడెల్ ఏజెన్సీకి చెందిన ఎ.జ్యోత్స్న, లాస్య, శివాని ఎంపికయ్యారు. వీరు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి యూత్ పార్లమెంటుకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు.
నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి జి. మహేశ్వరరావు మాట్లాడుతూ.. విజయనగరం నోడల్ ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థులు జాతీయ యువ పార్లమెంట్‌కు ఎంపికయ్యారని తెలిపారు. మార్చి 28న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో దాదాపు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలో ఈ ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారనీ, వారందరూ విశాఖపట్నం నుంచి ఎంపికయ్యారని మహేశ్వరరావు పేర్కొన్నారు.
ఏపీ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగించారు. ఆయా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఏపీఆర్‌ఎస్ సెట్ 2025కు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఏప్రిల్ 6వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా జూనియర్ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఫలితాలు, సీట్ల కేటాయింపు వివరాలను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తాజాగా విడుదల చేశారు. దివ్యాంగులు, అనాథలు, మత్స్యకారులు, మైనార్టీలు, ఆర్మీ కుటుంబాలకు చెందిన పిల్లలు, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ఏరియా, అత్యంత వెనుకబడిన కేటగిరీల నుంచి దాదాపు 13,297 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవగా.. తొలిదశలో 1944 మంది విద్యార్థులు సీట్లు పొందినట్లు తెలిపారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. ఐదోతరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలతో మెరిట్ జాబితాను రూపొందుపరిచినట్లు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.