ABN
, Publish Date – Apr 24 , 2025 | 05:39 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం కొత్తగా ఉన్నత స్థాయి మండలిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలి ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, వనరులను సమీకరించి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చైర్మన్‌గా సీఎస్, 18 మంది సభ్యులు
ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిని కట్టడి చేయడంతో పాటు వ్యాధి నివారణకు ప్రభుత్వం నడుంబిగించింది. సంస్థాగతంగా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, 18 మంది సభ్యులతో కూడిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్’ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ పంపించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు బుధవారం ఆమోదించారు. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు పర్యవేక్షించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఫలితాలను అంచనా వేయడం ద్వారా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్తగా ఏర్పాటైన ఉన్నత స్థాయి మండలి ఏపీఎ్‌ససి కృషి చేస్తుంది. వనరుల సమీకరణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల పటిష్ఠ అమలు బాధ్యతను ఈ మండలికి ప్రభుత్వం అప్పగించింది. విశేషాధికారాలతో ఏర్పాటు కానున్న ఈ మండలి రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ చర్యలు పటిష్ఠమైన అమలుకు అవసరమైన నాయకత్వాన్ని అందిస్తుంది. ఎయిడ్స్‌పై పోరాటానికి వివిధ ప్రభుత్వ శాఖలకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల్ని సమన్వయంతో వినియోగించే వీలు కల్పిస్తుంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ…
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date – Apr 24 , 2025 | 05:39 AM