Andhra Information: లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని ఘటనలో ట్విస్ట్.. అసలేం జరిగిందో తెలుసా? – Telugu Information | Lady Pupil Suspends after Assaults Lecturer with Slipper in Vizianagaram Raghu Engineering Faculty Watch

Written by RAJU

Published on:

పలుచోట్ల స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఒకప్పుడు టీచర్స్ ను చూస్తే భయపడే విద్యార్థులు ఇప్పుడు రివర్స్ పద్ధతిలో గురువులనే భయపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఇటీవల విద్యార్థుల ఆగడాలు భరించలేని ఓ హెడ్మాస్టర్ మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము.. మాకు మేమే శిక్షించుకుంటామంటూ గుంజీలు తీసి నిరసన తెలిపిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. అది జరిగిన కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లాకు చెందిన రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని టీచర్ పై దుర్భాషలాడుతూ చెప్పుతో దాడి చేసిన ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కళాశాలలో విశాఖకు చెందిన ఓవిద్యార్థిని ఇంజనీరింగ్ ఈసిఈ సెకండియర్ చదువుతుంది. ఈమె క్లాస్ జరుగుతుండగా ప్రక్కనే కూర్చొని సెల్ ఫోన్ లో పెద్ద పెద్దగా మాట్లాడుతూ.. పక్కవారికి ఇబ్బందికరంగా వ్యవహరించింది. సెల్ ఫోన్‌లో మాట్లాడటం వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, చిన్నగా మాట్లాడమని హెచ్చరించినా సదరు విద్యార్థిని ఏ మాత్రం వినలేదు.

దీంతో మహిళా లెక్చరర్ వెళ్లి విద్యార్థిని వద్ద ఉన్న ఫోన్‌ను బలవంతంగా తీసుకుంది. దీంతో సెల్ ఫోన్ తీసుకున్న లెక్చరర్ పై పట్టరాని కోపంతో నా సెల్ ఫోన్ నాకు ఇస్తావా లేదా? సెల్ ఫోన్ ఖరీదు పన్నెండు వేలు, నా ఫోన్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావ్? నా సెల్ ఫోన్ నాకు ఇవ్వకపోతే చెప్పుతో కొడతాను అంటూ దుర్భాషలాడుతూ మెరుపు వేగంతో లెక్చరర్ వద్దకు వెళ్లింది. దుర్భాషలతో ఆగకుండా చెప్పు తీసుకొని లెక్చరర్ ను కొట్టడం ప్రారంభించింది. విద్యార్థిని తనను చెప్పుతో కొట్టడం ఏంటి అని ఒకింత నిర్ఘాంతపోయిన లెక్చరర్.. ఆ విద్యార్థిని వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు.. లెక్చరర్ పై ముష్టి యుద్ధానికి దిగింది. ఇదంతా చూస్తున్న ప్రక్కనే ఉన్న ఇతర విద్యార్థులు, సహచర లెక్చరర్స్ ఘర్షణను నిలిపే ప్రయత్నం చేశారు.

వీడియో చూడండి..

ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ విద్యార్థి తన సెల్ ఫోన్‌లో బంధించాడు. అలా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న రఘు కాలేజ్ యాజమాన్యం ఎంక్వైరీ నిర్వహించింది. ఎంక్వైరీలో విద్యార్థిని.. విచక్షణ కోల్పోయి టీచర్ పై దాడికి దిగిందని నిర్ధారించి చర్యలకు దిగింది. ఆమెను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలేజ్ నిర్ణయంపై విద్యార్థిని ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights