Andhra: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా

Written by RAJU

Published on:

Andhra: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా

విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్‌లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. దాంతో.. 44 బ్యాగుల్లో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి తరలింపు ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Subscribe for notification
Verified by MonsterInsights