Andhra: భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు – Telugu Information | Chirala Folks Making Koti Goti Talambralu For Bhadrachalam Sri Seeta Rama Kalyanaotsavam

Written by RAJU

Published on:

సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. పండుగలు మొదలు కల్యాణ మహోత్సవాల వరకు ఒక్కొక వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. వేడుకలు ఏవైనా భావితరాలకు స్ఫూర్తి నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు చెందిందే సీతారాముల వారి కల్యాణ మహోత్సవం. కల్యాణంలో అతి పవిత్రంగా భవించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. వీటిలో వినియెగించే ఒక్కొక వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంది. పసుపు సకల శుభలకు దీపికగా… ముత్యాలు ముత్యం వంటి కల్మషం లేని మనస్సుతో వధూవరులు ఆనందంగా జీవించాలని ప్రతీకగా… ఇక ధాన్యం ధన దాన్యాలతో సరితూగలని భావనగా ఉంటాయి. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. అటువంటి జానకిరామునికి నిర్వహించే కల్యాణోత్సవంలో యాంత్రికంగా ఒలిచినవి కాకుండా కేవలం మహిళలు గోటితో మాత్రమే ఒడ్లను వలుస్తారు. ఇలా వలిచిన గోటి తలంబ్రాలనే భద్రాద్రిలో రాములోరి కళ్యాణానికి ఉపయోగిస్తారు.

దశాబ్దాల సాంప్రదాయం…

రాములోరి కల్యాణంలో వినియెగించే గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం బాపట్ల జిల్లా చీరాల వాసులకి దక్కింది. కల్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమాని భావిస్తారు భక్తులు. అటువంటిది సాక్ష్యాత్తూ ఆ జానకిరాముని కల్యాణానికి వినియెగించే కోటి గోటి తాలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్కర కార్యానికి శ్రీకారం చూట్టారు బాపట్ల జిల్లా చీరాల ప్రాంత వాసులు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. ప్రతి ఏటా విజయ దశమి నాటి మొదలుకొన్ని ఉగాది వరకు అంటే ఆరు నెలలు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో చీరాల పరిసర ప్రాంతాలలోని సీతారామ భక్తులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ కోటి గోటి తలంబ్రాలను ఎంతో భక్తిశ్రద్దలతో నియమ నిష్ఠలతో వలుస్తూ సీతారాములోరి సేవలో పరవశిస్తున్నారు. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. అంతేనా సాక్ష్యాత్తూ సీతారాముల వారి కల్యాణం మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకులు పొత్తూరి బాలకేశవులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification