
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘరానా మోసం జరిగింది. స్థానిక ఆర్ఆర్ కాంప్లెక్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ మహిళను ఏమార్చి రూ. 32 వేలు కాజేశాడు దుండగుడు. సదరు మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతడు డ్రా చేసి డబ్బులు ఇచ్చే సమయంలో కార్డులు మార్చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రూ. 32 వేలు డ్రా చేసి ఉడాయించాడు. డ్రా చేసినది ఫోన్‌కు మెసేజ్ రాగా.. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది సదరు మహిళ. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.