
తూర్పుగోదావరిజిల్లా రాజానగరంలో ఎద్దు వీరంగం సృష్టిస్తోంది. రోడ్డుపై వెళ్తున్న వారిపైకి వేగంగా వచ్చి కొమ్ములతో దాడి చేస్తోంది. అది రంకెలు వేస్తూ వీధుల్లో పరుగెడుతుండటంతో స్థానికుల్లో వణుకు మొదలైంది. సీసీ కెమెరాలో రికార్డయిన ఎద్దు దాడి తాలూకా దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఎద్దు అలా జనాలపై ఎందుకు దాడి చేస్తుందో అర్థం కావడం లేదు. ఎవరికీ ప్రాణాపాయం సంభవించకముందే ఆ ఎద్దును అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.