Amrutha Reacts to Final Verdict in Pranay’s Honor Killing Case

Written by RAJU

Published on:

  • ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన అమృత
  • న్యాయస్థానంలో న్యాయం జరిగింది
  • పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ ధన్యవాదాలు
Amrutha Reacts to Final Verdict in Pranay’s Honor Killing Case

ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత స్పందించింది. “ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. న్యాయస్థానంలో న్యాయం జరిగింది. పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ, సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. బాబు ఎదుగుతున్న నేపథ్యం… అతని భవిష్యత్తు, నా మానసిక పరిస్థితి దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నాను. నా అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్న.” అని అమృత పేర్కొంది.

READ MORE: CM Revanth Reddy: నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపింది.

READ MORE: PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. మొదటి భారతీయుడిగా ఘనత..

Subscribe for notification