- రాజ్యసభలో టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే చర్చ
- సీబీఐ గురించి పలు ప్రశ్నలు లేవనెత్తిన ఎంపీ
- సమాధానం చెప్పిన హోంశాఖ మంత్రి
- సీబీఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని స్పష్టం

రాజ్యసభలో చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హోం మంత్రిత్వ శాఖను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందించిన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కీలక విషయాన్ని వెల్లడించారు. సీబీఐ, ఈడీ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావని ఆయన అన్నారు. కాబట్టి, ప్రశ్నలు లేవనెత్తే ముందు, వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని హోంమంత్రి సూచించారు.
READ MORE: Vodafone Idea: ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’తో వొడాఫోన్ ఐడియా చర్చలు..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ.. సరిహద్దు భద్రత గురించి ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పశ్చిమ బెంగాల్‌కు రూ.386 కోట్లు రావాల్సి ఉందన్నారు. అనంతరం సీబీఐపై ప్రశ్నలు లేవనెత్తారు. సీబీఐ హోం మంత్రిత్వ శాఖ కొమ్ము కాస్తోందన్నారు. ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా.. “సీబీఐ హోం మంత్రిత్వ శాఖతో లేదు . సీబీఐ హోం మంత్రిత్వ శాఖ పరిధికి రాదు. మీ చర్చ హోం శాఖ గురించి మాత్రమే.. దీని గురించి మాత్రమే మాట్లాడాలి. వారు కోరుకుంటే చర్చా పరిధిని విస్తరించి పూర్తి సమాచారం అందిస్తాం. నేను ఎవరి దయతోనూ సభకు రాలేదు. నేను ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచాను. వారు తప్పుడు ప్రచారాలు చేయడం మానేయాలి.” అని అమిత్ షా మండిపడ్డారు. గోఖలే ప్రస్తావిస్తున్న సీబీఐ కేసులు ఎన్నికల హింసకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైన కేసులు అని అమిత్ షా అన్నారు. ఎన్నికల హింస ఎలా జరిగిందో అందరికీ తెలుసన్నారు. బీజేపీ నేతలను ఎంపిక చేసి హత్య చేశారని వెల్లడించారు.