ALLEN: పీజీ మెడికల్ ఆశావహుల కోసం సూపర్ యాప్!

Written by RAJU

Published on:

న్యూఢిల్లీ: మెడికల్ కోచింగ్‌లో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన అలెన్ తాజాగా ‘అలెన్ నెక్ట్స్ యాప్’ (ALLEN NExT App)ను విడుదల చేసింది. NEET-PG, INI-CET, FMGE పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం సమగ్రమైన పరిష్కారంగా పీజీ మెడికల్‌ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో విస్తృత శ్రేణిలో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యాప్ విడుదల సందర్భంగా అలెన్ నెక్ట్స్ వెర్టికల్ హోల్ టైం ఎగ్జిక్యూటివ్ అమన్ మహేశ్వరి మాట్లాడుతూ.. హడావుడి షెడ్యూల్స్‌తో సంబంధం లేకుండా వైద్య ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దడమే ఈ యాప్ లక్ష్యమన్నారు. NEET-PG, INI-CET, FMGE పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేలా సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అందించడం ద్వారా పీజీ మెడికల్‌ విద్యార్ధులు తమ విద్య, ప్రొఫెషనల్‌ లక్ష్యాలను అతి సులభంగా చేరుకునేందుకు తోడ్పాటునందించడంలో భాగంగానే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. మూడు సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు.. ఆల్ఫా, బీటా, డెల్టా విద్యార్ధుల వైవిధ్యమైన అవసరాలను తీర్చడంతో పాటుగా తమ ప్రిపరేషన్స్‌ కోసం అత్యుత్తమ వనరులను పొందేందుకు ఈ యాప్ భరోసా అందిస్తుందని అన్నారు.

ఆల్ఫా కోర్సు: ఈ ప్యాకేజీ ఆఫ్‌లైన్‌ క్లాస్‌రూమ్‌ అభ్యాసం, పునశ్చరణ సమ్మేళనంగా ఉంటుంది. ఇందులో 700 గంటల వీడియోలు ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఎడ్జ్‌, NExT-2 కోసం క్లినికల్‌ స్కిల్‌ వీడియోలు, 200 గంటలకు పైగా ర్యాపిడ్‌ రివిజన్‌ వీడియోలు, గత సంవత్సరాల ప్రశ్నలను కవర్‌ చేస్తూ 10 వేలకు పైగా క్వశ్చన్‌బ్యాంక్‌, క్లినికల్‌ క్వశ్చన్స్‌‌తో పాటు 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ మైనర్‌, మేజర్‌ టెస్ట్‌లు, డిజిటల్‌, ప్రింటెడ్‌ నోట్స్‌ ఉంటాయి.

బీటా కోర్సు: దీనిని ఆన్‌లైన్‌ అభ్యాసం, రివిజన్‌ కోసం డిజైన్‌ చేశారు. ఇందులో ఆల్ఫా కోర్సు నుంచి రిసోర్సులైన 700 గంటల వీడియోలు, ఎక్స్‌ట్రా ఎడ్జ్‌ వీడియోలు, క్లినికల్‌ స్కిల్‌ వీడియోలు, 200 గంటలకు పైగా ర్యాపిడ్‌ రివిజన్‌ వీడియోలు, 10వేలకు పైగా క్వశ్చన్‌లు, 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ మైనర్‌, మేజర్‌ టెస్ట్‌లు, డిజిటల్‌, ప్రింటెడ్‌ నోట్స్‌ ఉంటాయి.

డెల్టా కోర్సు : ఈ ప్యాకేజీ 10వేలకు పైగా ప్రశ్నలు, 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ టెస్ట్‌లు, మేజర్‌ టెస్ట్‌లు ఉంటాయి. ALLEN NExT యాప్‌‌ను ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ALLEN NExT ఆఫ్‌లైన్‌ కేంద్రాలను త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

Subscribe for notification