ఈ సువిశాల విశ్వంలో కేవలం మనుషులే కాదు, ఇతర జీవులు కూడా ఉన్నాయని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు నమ్ముతారు. వేరే ఎక్కడో గ్రహంతర వాసులు ఉన్నారని, భవిష్యత్తులో వాళ్లు మనతో స్నేహం లేదా యుద్ధం చేసే అవకాశం ఉందనిక కూడా చాలా మంది సైంటిస్టులు చెబుతుంటారు. ఈ విశ్వంలో ఏలియన్స్ కోసం కొన్నేళ్లుగా మనం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నారనే ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు. కానీ, కచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి అని మాత్రం చాలా మందిలో బలమైన నమ్మకం ఉంది. మనం భూమి అనే ఈ గ్రహంపై మనుగడ సాగిస్తున్నట్లు.. ఈ విశ్వంలో వేరే గ్రహంపై కూడా మనుషులను పోలిన జీవం ఉంటుందని, వాళ్లను కనిపెట్టాలనే ఉత్సాహం శాస్త్రవేత్తల్లో కొన్నేళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అయితే.. ఏలియన్స్ ఎక్కడో కాదు, మన సౌర కుటుంబంలోని అంగారక గ్రహంపైనే ఉన్నారని తాజాగా ఓ వ్యక్తి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతను సైంటిస్ట్ కాదు. అయినా కూడా అతని మాటలకు ఎందుకంత విలువ అంటే.. అతను గతంలో అమెరికాకు చెందిన CIA(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన పేరు మెక్‌మోనిగల్. ఈయన గతంలో సీఐఏలో “రియోట్ వ్యూయర్ నంబర్ 1″గా గుర్తింపు పొందారు. ఏదైనా ఒక సుదూర ప్రాంతాన్ని, లేదా ఒక సందేశాన్ని గుర్తించేందుకు, దాన్ని డీ కోడ్ చేసేందుకు ఈ రిమోట్ వ్యూయర్లను ఉపయోగించేవారు. అలా 1980ల్లో మెక్‌మోనిగల్‌కు ఒక ప్రదేశం గురించి అధ్యాయనం చేసి దాని గురించిన వివరాలను నివేదికగా సమర్పించాలని సీఐఏ ఆయనను ఆదేశించింది. అతనకు అప్పగించిన పని చేస్తన్న క్రమంలో ఆ ప్రదేశంలో మనిషి పోలిన జీవాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. వాళ్లు మనకంటే చాలా పొడుగ్గా ఉండి, ఏదో తుపాన్ కారణంగా ఒక పిరమిడ్ లాంటి కట్టడంతో తలదాచుకున్నట్లు, ఆ ప్రాంతం భూమిపై ఉందని అనుకున్నారు. కానీ, ఇదే నివేదికను పరిశీలించిన నాసా ఆ ప్రదేశం అంగారక గ్రహంలో ఓ ప్రాంతాన్ని పోలి ఉందని నిర్ధారించింది. దీంతో అంగారక గ్రహంపై గతంలో కచ్చితంగా జీవం మనుగడ సాగించిందని మెక్‌మోనిగల్ విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా అమెరికన్ ఆల్కెమీ పొడ్‌కాస్ట్‌లో వివరించారు.
గతంలో భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ భూమికి పంపింది. అంగారక గ్రహంపై అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ గతంలో టీజీవోను ప్రయోగించింది. అయితే ఈ సందేశాన్ని గ్రహంతర వాసులే పంపారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అలాగే ఇటీవలె చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి, అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. వీటన్నింటిని బట్టి అంగారక గ్రహంపై ఏలియన్స్ ఉన్నాయనే విషయాన్ని చాలా మంది విశ్వసిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.