- నేడే అక్షయ తృతీయ
- బంగారం కొనడానికి ఇదే శుభ సమయం!

వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు వారి వారి రాశిచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉంటారు. కాబట్టి సూర్య చంద్రుల ఆశీర్వాదాల ఫలం శాశ్వతంగా ఉంటుంది. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు చేసిన పని, ధాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులను కొనుగోలు చేసి, చాలా వస్తువులను దానం చేస్తారు. ముఖ్యంగా బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. అక్షయ తృతీయను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. మరి నేడు బంగారం కొనడానికి శుభ సమయం ఎప్పుడుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Anakapalle: పెళ్లై ఏడాది గడవక ముందే ఘోరం.. అసలు ఏమైందంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29న అంటే ఈరోజు సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, అక్షయ తృతీయను ఏప్రిల్ 30 బుధవారం జరుపుకుంటారు. పూజ చేయడానికి శుభ సమయం ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
Also Read:Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ.. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..
బంగారం కొనడానికి అనుకూలమైన సమయం
ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు బంగారం కొనడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. బంగారం కొనలేకపోతే బంగారం పూత పూసిన వస్తువులను కొనండి. ఈ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వీటిని కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో ఇత్తడి పాత్రలు, అలాగే పసుపు ఆవాలు కొనడం కూడా చాలా శుభప్రదం. ఉదయం చల్లటి నీటితో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీని పూజించాలి. తెల్లని పువ్వులు అర్పించి, విష్ణువు, లక్ష్మీ దేవి మంత్రాలను జపించాలి. తరువాత ఏదైనా దానం చేస్తే పుణ్యం వస్తుందంటున్నారు పండితులు.