- వైభవ్ ది జస్ట్ లక్ అంటూ గిల్ వ్యాఖ్యలు
- అజయ్ జడేజా అసహనం

ఐపీఎల్ చరిత్రలో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రీడాలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ దిగ్గజాలు వైభవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వైభవ్ పై చేసిన వ్యాఖ్యలు గిల్ ను చిక్కుల్లో పడేశాయి. వైభవ్ ది జస్ట్ లక్ అంటూ గిల్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు.
Also Read:Story Board : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం ఎలా? పాక్కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమేనా?
వైభవ్ సూర్యవంశీ తొలి ఐపీఎల్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లకు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించింది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలనే జట్టు ఆశలను పెంచింది. సూర్యవంశీ రికార్డు బద్దలు కొట్టిన ఇన్నింగ్స్ తర్వాత, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ.. ఇది అతడికి కలిసొచ్చిన రోజు.. లక్కీ డే అని అన్నాడు. అతని హిట్టింగ్ అద్భుతంగా ఉంది. అతను తన రోజును సద్వినియోగం చేసుకున్నాడు” అని అన్నాడు. గిల్ వ్యాఖ్యలపై భారత మాజీ బ్యాట్స్‌మన్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిల్ ప్రకటనను తీవ్రంగా విమర్శించారు.
Also Read:Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
జియో హాట్‌స్టార్‌లో జడేజా మాట్లాడుతూ.. “టీవీలో కొంతమంది ఆటగాళ్ళు వైభవ్ సెంచరీని కేవలం అదృష్ట దినం అని పిలుస్తున్నారు. 14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను నమ్మకం ఉంచుకుని, చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చడం సామాన్యమైన విషయం కాదు. మీకు ఇది తెలిసినప్పటికీ అతడిది లక్ అని అనడం సరైనది కాదు అని చురకలు అంటించారు. “మనమందరం 14-15 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడాలని కలలు కన్నాము. అలాంటి ఇన్నింగ్స్‌లను ఊహించాం.. కానీ ఈ యువకుడు ఆ కలను నిజం చేసుకున్నాడు. అతని బలం, అతని సమయం, అతని ప్రశాంతత, అదే నన్ను ఆశ్చర్యపరిచింది. అతని సెంచరీ చాలా కాలం గుర్తుండిపోతుందని అన్నాడు.
Also Read:Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
వైభవ్ వయసు 14 సంవత్సరాల 32 రోజులు. అతను ఈ లీగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా యూసుఫ్ పఠాన్ 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో, యూసుఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్ పై 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. టోర్నమెంట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. అతని రికార్డు ఇప్పుడు 2025 లో బద్దలైంది. మొత్తం మీద ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను 2013లో పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో సెంచరీ చేశాడు.