Airtel Introduces RS.100 and RS.195 Jio Hotstar Plans for IPL.

Written by RAJU

Published on:

  • రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం
  • ఫ్యాన్స్ కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్
  • జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త ప్లాన్లు.
Airtel Introduces RS.100 and RS.195 Jio Hotstar Plans for IPL.

రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్యాన్స్.. నిరంతరాయంగా మ్యాచ్‌లు చూసేందుకు తమ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా ఐపీఎల్ ప్రేక్షకుల కోసం రూపొందించారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఈ ప్లాన్‌లు కొనసాగుతాయి. ఈ ప్లాన్ల ధర రూ.100 నుండి ప్రారంభమవుతుంది.

Read Also: Meerut murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యలో ట్విస్ట్.. చేతబడి, బాలీవుడ్ డ్రీమ్స్..

​కొత్త జియో హాట్‌స్టార్ ప్లాన్‌లు రూ.100 & రూ.195:
ఎయిర్‌టెల్ కొత్తగా రూ.100, రూ.195 విలువైన జియో హాట్‌స్టార్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి డేటా వోచర్‌లుగా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమ వద్ద ఇప్పటికే యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.100 ప్లాన్ ప్రయోజనాలు:
రూ.100 విలువైన ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 5GB డేటా ప్రయోజనం లభిస్తుంది. అయితే.. ఇందులో అపరిమిత కాలింగ్ లేదా SMS ప్రయోజనం ఉండదు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 30 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

​ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్ ప్రయోజనాలు:
రూ.195 విలువైన ప్లాన్ 90 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. దీనిలో 15GB డేటా అందించబడుతుంది. అదనంగా 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. 5GB డేటా మాత్రమే అందించే రూ.100 ప్లాన్ కంటే, 15GB డేటా లభించే రూ.195 ప్లాన్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉచిత జియోహాట్‌స్టార్‌తో వచ్చే ఇతర ఎయిర్‌టెల్ ప్లాన్‌లు:
ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్‌లలో రూ.3999, రూ.549, రూ.1029, రూ.398 ధరల్లో ఉన్న ప్లాన్లు జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి.

 

జియో కొత్త ప్లాన్‌ల వివరాలు

రూ.100 ప్లాన్: 90 రోజుల చెల్లుబాటుతో 5GB డేటా, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.
రూ.195 ప్లాన్: 90 రోజుల చెల్లుబాటుతో 15GB డేటా, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.

Subscribe for notification