- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవకు సానుకూల ఫలితం
- వాయుసేన, పౌర విమానయాన సేవలకు పచ్చజెండా
- ప్రధాని, రక్షణమంత్రికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం లేఖలో చేశారు.
READ MORE: CM Chandrababu: రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశాం..
స్థానిక ప్రజలు, నాయకుల నుంచి కొంతకాలంగా వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ కి 29 జనవరి, 2025 నాడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వ్యక్తిగతంగా కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజావసరాలకు సద్వినియోగం చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై రక్షణ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత సానుకూల నిర్ణయాన్ని తెలియజేస్తూ.. 4 ఏప్రిల్, 2025 (శుక్రవారం) కిషన్‌రెడ్డికి లేఖరాశారు. రాజ్‌నాథ్ సింగ్ సానుకూల స్పందనను కిషన్‌రెడ్డి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇందుకుగానూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
READ MORE: MLC Nagababu: పిఠాపురంలో హై టెన్షన్.. నాగబాబు పర్యటనలో జై వర్మ నినాదాలు
ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తి వ్యాపారానికి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఆదిలాబాద్ ప్రధానమైన కేంద్రంగా ఉందన్నారు. దీంతో ఆదిలాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనుంచి.. విమానాశ్రయాన్ని తెరిపించే విషయంలో చొరవతీసుకోవాలని దశాబ్దాలుగా డిమాండ్ వినిపిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై తాను 7 జూలై, 2022 నాడు, 15 ఫిబ్రవరి, 2023నాడు నాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిట్లు చెప్పారు. ఐదేళ్లుగా ఈ విషయంపై పదే పదే ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. అటు, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని 6 అక్టోబర్, 2021 నాడు నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని విమర్శించారు.
READ MORE: Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు..
ఇటీవలే వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు లభించడంతో.. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తిచేసి ఇస్తే.. ఇతర మౌలికసదుపాయాల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసేందుకు వీలవుతుందని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా వీలైనంత త్వరగానే.. వరంగల్ ప్రజల స్వప్నం సాకారం కానుందని సంతోషం వ్యక్తం చేశారు. గతనెలలో.. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు, ఇందుకు సంబంధించిన పురోగతి తదితర విషయాలను తాను, రామ్మోహన్ నాయుడు సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.