How to Cure Acidity Quickly : అసిడిటీ ఒక జీర్ణసంబంధిత సమస్య. కడుపులో ఆమ్లం ఉత్పత్తి అవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. రోజూ వేళకు తినకపోవడం, మనం అనుసరించే చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, క్రమరహిత జీవనశైలి ఇందుకు ప్రధానకారణాలు. ఒకసారి అసిడిటీ కడుపులో తీవ్రమైన నొప్పి, గుండెల్లో మంట, ఎక్కిళ్లు, కడుపు నొప్పిగా అనిపించి కుదురుగా ఉండలేం. ఉపశమనం కోసం మందులను ఆశ్రయించే కంటే.. మీ ఆహారపు అలవాట్లలో ఈ చిన్నపాటి మార్పులు చేసుకుంటే చాలు. అసిడిటీ సమస్య చిటికెలోనే తొలగిపోతుంది.
అసిడిటీ తగ్గించే కొన్ని సాధారణ చిట్కాలు :
ఆహారపు అలవాట్లలో ఈ మార్పులు చేసుకోండి.
1. భోజనానికి షెడ్యూల్ :
వేళకు ఆహారం తినడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయండి. ఎక్కువసేపు ఆకలితో ఉండటం మానుకోండి. రోజులో ప్రతి 2 లేదా 3 గంటలకు ఓసారి కొద్దికొద్దిగా తేలికపాటి ఆహారం తినండి.
2. వేపుళ్లు, కారం వద్దు :
ఎక్కువ కారం, నూనెలు ఉంటే ఆహారం అసిడిటీని పెంచుతాయి. వేపుళ్లు ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావు. వీటికి బదులుగా ఉడికించిన పదార్థాలు, తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినండి.
3. కెఫిన్, శీతల పానీయాలు :
టీ, కాఫీ, శీతల పానీయాలు, సోడా వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు వంటి పానీయాలు ఎంచుకోండి.
4. తిన్న వెంటనే పడుకుంటే :
భోజనం తిన్న వెంటనే పడుకుంటే కడుపులో ఆమ్లం పెరుగుతుంది. అందుకే కడుపు నిండా తిన్నాక కనీసం 30-40 నిమిషాలు నిటారుగా కూర్చోండి. ఇలా చేస్తే కడుపులో ఆమ్లం పెరగదు.
5. ఆహారంలో ఫైబర్ :
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, సలాడ్లు గ్యాస్ సమస్యకు సహజ పరిష్కారాలు. వీటిల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో కడుపులో ఎసిడిటీని నివారించి ఉపశమనం కలిగిస్తుంది.
6. ఆల్కలీన్ :
అరటిపండు, దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, బొప్పాయి వంటి పండ్లు అసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
7. నీరు :
రోజులో కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఎందుకంటే నీరు శరీరంలోని విషతుల్యాలను, మలినాలకు బయటికి పంపిస్తాయి. తద్వారా కడుపులో ఆమ్లత తగ్గుతుంది.
8. అల్లం,తులసి :
అల్లం, తులసి ఆకులను నమిలితే గ్యాస్ బాధ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థను చక్కదిద్దుతాయి.
Read Also : Blood Pressure : బీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన 5 రకాల ఆహారాలు..
Excess Salt in Food : ఆహారంలో అదనపు ఉప్పు తగ్గించేందుకు.. 5 సులభమైన పద్ధతులు.
Kidney Problem: ఈ తప్పులు చేస్తే కిడ్నీలు చెడిపోవడం ఖాయం.. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉండాలంటే..