Aadhar-Voter ID Hyperlink: ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌ తప్పనిసరి కాదు! కానీ కారణం చెప్పాల్సిందే! – Telugu Information | Voters might acquired choice to hyperlink or not their Aadhar Voter ID, verify particulars in telugu

Written by RAJU

Published on:

ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021కి ఆమోదం లభించింది. 2022లో నోటిఫై చేసిన ఆధార్-ఎలక్టర్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ (ఈపీఐసీ) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అయితే ఓటరు ఐడీతో ఆధార్‌ కార్డును లింక్‌ చేసే ప్రక్రియ ఓటరు ఇష్టాన్ని బట్టి చేసుకునేందుకు అనుమతిచ్చింది. అయితే అందుకు సరైన కారణాన్ని మాత్రం చూపించాల్సి ఉంటుంది.

కొనసాగుతున్న సాంకేతిక సంప్రదింపులు..

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)తో అనుసంధానానికి సంబంధించి సాంకేతిక సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. ఆధార్ సమర్పించడానికి నిరాకరించే ఓటర్లు ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు(ఈఆర్‌ఓ)ల ముందు హాజరు కావాల్సి ఉంటుందా అని అడిగినప్పుడు.. అవన్నీ ఊహాగానాలుమాత్రమేనని చెప్పారు. పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈసీఐ అధికారులు దీనిపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఆధార్‌ పోతే ఓటు కూడా పోతుందా..

ఆధార్, ఎన్నికల పారదర్శకత సంబంధిత అంశాలపై పనిచేసిన కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్, యూఐడీఏఐ ఆధార్‌ను రద్దు చేస్తే ఓటరును ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ప్రతి ఓటరు ఎదుర్కొనే ఇబ్బంది అన్నారు. దీనిని పరిష్కరించాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

పూర్తిగా స్వచ్ఛందం..

ఆధార్-ఓటర్‌ లింక్‌ అనేది పూర్తిగా స్వచ్ఛందమని, దీనిని ప్రతిబింబించేలా నమోదు ఫారమ్‌లను సవరించనున్నట్లు ఈసీఐ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు 2023 తీర్పుకు అనుగుణంగా లింక్ చేయడం జరుగుతుందని ఈసీఐ తెలిపింది. అయితే ఒకవేళ లింక్‌ చేయడానికి నిరాకరిస్తే అందుకో ప్రత్యేకంగా ఓ ఫారం ఇవ్వాల్సి వస్తే అది ‘షో కాజ్‌’ మాదిరిగా మారిపోయే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification
Verified by MonsterInsights