Revanth Reddy: ఏఐసీసీ లీగల్ సెల్ మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సంఘ్ పరివార్ లో కలకలం సృష్టించడంతో పాటు, ఆ పార్టీలో అంతర్మధనానికి, కొత్త చర్చకు దారితీశాయి. గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు
మోదీని తొలగించేందుకు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాచ్ పాయి ప్రయత్నం చేశారా..? ప్రధాని పదవిని అంటిపెట్టుకుని కూర్చున్న మోదీని తొలగించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విఫలయత్నం చేశారని, 75 ఏళ్లు దాటిన వారు రాజకీయ పదవులు ఆశించరాదనే నిబంధనను తనకు అనుకూలంగా మార్చుకొని, అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వారిని తన దారి నుంచి అడ్డుతొలగించుకున్నాడని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీ, సంఘ్ పరివార్ లో అలజడి సృష్టించాయి.
మోదీని గద్దె దించేందుకు ప్రయత్నాలు జరిగాయా..?
25 ఏళ్లుగా పదవిని అంటిపెట్టుకుని కూర్చున్న మోడీని గద్దె దింపేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కు సాధ్యం కాలేదని, కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమని ఆయన సమావేశంలో ఉటంకించారు. మోడీ విధానాలను వ్యతిరెకిస్తూ విరుచుకుపడ్డ రేవంత్ బీజేపీ, సంఘ్ పరివార్ లో చిచ్చుపెట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమౌతుంది.
రాహుల్ తరపున తాను చెబుతున్న అని మోదీని గద్దె దింపేందుకు సంఘ్ పరివార్ సాధ్యం కాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోదీని గద్దె దింపుతోందనీ, అటల్ జీ కి, మోహన్ భగవత్ కు సాధ్యం కానిది. కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమని అన్నారు. అలాగే మోడీ తప్ప బీజేపీకి దిక్కులేదనే రీతిలో మోడీ లేకుంటే 150 సీట్ల కన్నా ఎక్కువ రావు అని నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు సైతం ఆయన ఉటంకిస్తూ, 150 సీట్ల కన్నా ఎక్కువ రాకుండా కాంగ్రెస్ పరివార్ ఏకమై మోదీని ఓడిస్తామనీ, ఇది మీ డైరీలో రాసుకొమ్మని సవాల్ కూడా చేశాడు.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏమి చేసింది
కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసిందని ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా రేవంత్ కాంగ్రెస్ చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను తన ప్రసంగంలో జోడించారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ నిర్మించిందని, ప్రధానిగా అయ్యేందుకు అవకాశం ఉన్నా సోనియా గాంధీ ఆ పదవిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్సింగ్ కు అవకాశం ఇచ్చారని, రాహుల్ గాంధీ సైతం కేంద్ర మంత్రిగా అయ్యేందుకు అవకాశమున్నా వద్దనుకొని, కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చారని, ఉగ్రవాదులను తుదముట్టించేందుకు కంకణం కట్టుకున్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని, ఆ వారసత్వం నుంచి వచ్చిన బలమైన నాయకత్వం కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ భారత్ జూడో యాత్ర నుంచి మొదలు తెలంగాణలో మార్పుకు శ్రీకారం చుట్టి, సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టేందుకు మార్గదర్శిగా నిలిచాడని, ఈ మోడల్ ను దేశవ్యాప్తంగా పరిచయం చేస్తామని, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ఇచ్చిన పిలుపుకు సభలో కూర్చున్న వారు గుణాత్మకంగా స్పందించిన తీరు కాంగ్రెస్ లో ఒక ఊపు తెచ్చిందనడంలో సందేహం లేదు.
[