Prime Headlines @1PM 01.05.2025 – NTV Telugu

Written by RAJU

Published on:

  • గోల్డ్ లవర్స్ కు పండగే.. రూ. 2 వేలు తగ్గిన తులం బంగారం ధర
  • ఏ రాష్ట్రానికి.. ఆ రాష్ట్రం యూనిట్ గా కుల గణన చేయాలి
  • ‘ఆపరేషన్ కగార్’ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
  • ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం.. అధికారులను ప్రశ్నించనున్న కమిటీ
Prime Headlines @1PM 01.05.2025 – NTV Telugu

ప్రధాని సభకు రావాలంటూ జగన్‌కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు

అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రొటోకాల్ అధికారులు వెళ్లారు. అయితే గురువారం జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో పీఏ కే.నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసి వెళ్లారు.

గోల్డ్ లవర్స్ కు పండగే.. రూ. 2 వేలు తగ్గిన తులం బంగారం ధర

బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా తులం పుత్తడిపై రూ.2 వేలు తగ్గింది. పుత్తడి ధరలు దిగొస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2000 తగ్గడంతో రూ. 87,750 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,180 తగ్గడంతో రూ. 95,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2160 తగ్గడంతో రూ. 95,880 వద్ద ట్రేడ్ అవుతోంది.

సోనియా గాంధీ ఎప్పటికైనా తెలంగాణకు దేవతే..

పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను తెలంగాణకు విలన్‌గా అభివర్ణించడం అర్థరహితమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని, ఉద్యమ నాయకుడు కాబట్టే 2014లో బీఆర్ఎస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఎప్పటికీ తెలంగాణకు దేవతలాంటి వారని ఆయన అన్నారు.

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తుందని, పహల్గామ్ దాడి దర్యాప్తులో సహకరించాలని పాకిస్తాన్‌ను కోరిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో, దక్షిణాసియాలో ఇటీవలి పరిణామాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయడం అనే అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది.

రేపు ఏపీకి మోడీ.. అమరావతి పనులు ప్రారంభించనున్న ప్రధాని

ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ  పున:ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం.. అధికారులను ప్రశ్నించనున్న కమిటీ

విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఆనంద నిలయంలో విచారణ కొనసాగనుంది. దేవాదాయశాఖ అధికారులను కమిటీ విచారించనుంది. బుధవారం గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. అయితే గోడ ఇటీవలే నిర్మించారు. అయితే గోడ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. హడావుడిగా గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. పిల్లర్లు లేకుండానే గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షానికి గోడ కూలిపోయినట్లుగా సమాచారం. ఆలయ అధికారుల నిర్లక్ష్యంగానే ఇదంతా జరిగినట్లుగా భావిస్తున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం.. అధికారులను ప్రశ్నించనున్న కమిటీ

విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఆనంద నిలయంలో విచారణ కొనసాగనుంది. దేవాదాయశాఖ అధికారులను కమిటీ విచారించనుంది. బుధవారం గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. అయితే గోడ ఇటీవలే నిర్మించారు. అయితే గోడ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. హడావుడిగా గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. పిల్లర్లు లేకుండానే గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షానికి గోడ కూలిపోయినట్లుగా సమాచారం. ఆలయ అధికారుల నిర్లక్ష్యంగానే ఇదంతా జరిగినట్లుగా భావిస్తున్నారు.

రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు ఆదేశం

డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు.

‘ఆపరేషన్ కగార్’ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం, కర్రిగుట్ట పరిధిలోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది జూన్ 20, 21 తేదీలలో ఇంగ్లాండ్‌లో నిర్వహించబడనున్న ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum) సదస్సుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సును ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకటించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను ఈ సదస్సులో భాగంగా వివిధ దేశాల నిపుణులు, విద్యార్థులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా మారతాయని, తద్వారా భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగమవడానికి వారందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని సిద్ధార్థ్ సేఠి తెలిపారు.

ఏ రాష్ట్రానికి.. ఆ రాష్ట్రం యూనిట్ గా కుల గణన చేయాలి

తెలంగాణలో కుల గణనపై ప్రభుత్వ ప్రకటన రాహుల్ గాంధీ నాయకత్వంలోని జోడో యాత్రలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ, శాసన మండలి విపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కుల గణన దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన విధానం గురించి ముఖ్యంగా వివరించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు వెళ్లిన జోడో యాత్రలో కుల గణనపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “కుల గణన చేయడానికి అధికారంలోకి వస్తేనే అవకాశం” అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ మార్గనిర్దేశం ప్రకారం, తెలంగాణలో కుల గణనను సక్రమంగా నిర్వహించి, దేశానికి ఒక మోడల్‌గా నిలిపింది.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని యూనిట్‌గా కుల గణన చేయడం అత్యంత అవసరం అని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం, వర్గం ఉందని ఆయన వివరించారు. ఆయన చేసిన సర్వే 8 పేజీల ప్రశ్నావళి ద్వారా రూపొందించబడింది. ఈ సర్వేలో ప్రైవసీ యాక్ట్‌ను కూడా అనుసరించామని, 95 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించి, సర్వే మానిటరింగ్ కోసం సూపర్ వైజర్లు నియమించామని తెలిపారు. సర్వేలో 3 శాతం మంది పాల్గొనకపోవడం వల్ల తిరిగి వారికి అవకాశం ఇచ్చామనీ, తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights