భారత క్రికెట్‌లో వయసు మోసం విషయంలో మరోసారి చర్చ మొదలైంది. ఈసారి దాని కేంద్రబిందువుగా నిలిచిన పేరు, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 సంవత్సరాల వయసులోనే సెంచరీ కొట్టి రికార్డులను తిరగరాశాడు. అయితే అతని ఈ అద్భుత ప్రదర్శనపై ప్రశంసలతోపాటు అనుమానాలూ మొదలయ్యాయి. భారత మాజీ బాక్సర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ ఈ అంశంపై స్పందిస్తూ, “భాయ్, అజ్ కల్ ఉమర్ చోటీ కర్ కె క్రికెట్ మే భీ ఖేల్నే లాగే,” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అంటే “ఇప్పుడిక క్రికెట్ ల్లో కూడా వయస్సు తగ్గించుకుని ఆడటం మొదలైంది” అని ఆయన ఏదో సంకేతమిచ్చారు. ఇది నేరుగా పేరు చెప్పకపోయినా, వైభవ్ సూర్యవంశీపై కామెంట్ చేశాడా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో పలువురు వినియోగదారులు వైభవ్ వయస్సుపై అనుమానం వ్యక్తం చేశారు. కొందరు అతని ఇంటర్వ్యూల వీడియోలను ఉటంకిస్తూ, అతను చెప్పిన దానికంటే పెద్దవాడిగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. “ఇది 3-4 ఏళ్ల నాటి వీడియో, అందులో అతను తన వయస్సు కంటే చిన్నవాడిగా కనిపించలేదని చెప్పాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయాలి. వయస్సు మోసం నిరూపితమైతే నిషేధం విధించాలి” అని ఓ యూజర్ స్పష్టం చేశాడు. మరొకరు, “వయస్సు మోసం అయినా, 15-16 ఏళ్ల వయస్సులో అంత పవర్ హిట్టింగ్ చేయడం అద్భుతం” అంటూ చర్చను మరింత వేడెక్కించారు.
ఈ నేపథ్యంలో, వయస్సు మోసం భారత క్రీడా రంగాన్ని తొలితరం నుంచే వెంటాడుతున్న సమస్యగా మారింది. ముఖ్యంగా జూనియర్ స్థాయిలో ఇటువంటి మోసాలు జరిగినప్పుడు న్యాయమైన అవకాశాలు కోల్పోతున్న ఇతర యువ ప్రతిభావంతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిని అరికట్టేందుకు బీసీసీఐ గతంలో బలమైన ధృవీకరణ విధానాలను తీసుకువచ్చింది. అయినా, పలు సందర్భాల్లో మోసాలు బయటపడుతూనే ఉన్నాయి.
ఇంతలో, అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఘనతను సూర్యవంశీ అందుకున్నా, వాస్తవంగా అతను 14 సంవత్సరాల వయసులో ఉన్నాడా? అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం కోసం ఎదురుచూస్తోంది. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్, ఈ రికార్డుతో పాటు వివాదాన్ని కూడా ఆకర్షించాడు. ఇక దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వయస్సు నిజమైతే ఇది ఒక అద్భుత విజయంగా నిలుస్తుంది, లేదంటే మరో విషాదగాథగా మారే అవకాశం ఉంది.
Bhai aaj kal umar choti ker ke cricket me bhe khelne lage 🤔
— Vijender Singh (@boxervijender) April 30, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..