హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. కొత్త రిటైల్ ఆరోగ్య బీమా పాలసీ ‘మెడికేర్ సెలెక్ట్’ను విడుదల చేసింది. రిటైల్ హెల్త్ పోర్టుఫోలియోతో పాటు బీమా వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసుకునే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకువచ్చినట్లు టాటా ఏఐజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ గుప్తా తెలిపారు. ఎలాంటి ఎంట్రీ వయసు లేకుండా, అందుబాటు ధరల్లో ఉండే ప్రీమియంతో ఈ సమగ్ర ఆరోగ్య బీమా పాలసీని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి వయోపరిమితులు లేకుండా ఈ పాలసీని అందరికీ ఆఫర్ చేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. టాటా ఏఐజీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కీలక మార్కెట్లుగా ఉన్నాయని, గత ఏడాది కాలంలో కంపెనీ రిటైల్ హెల్త్ విభాగం ఇక్కడ మూడింతల వృద్ధిని నమోదు చేసిందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 1,600కు పైగా హాస్పిటల్స్ నెట్వర్క్తో పాటు 14,000 మంది అడ్వైజర్లను టాటా ఏఐజీ కలిగి ఉందన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరుల్లో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కార్యాలయాలను కలిగి ఉంది.
గడిచిన రెండేళ్లలో టాటా ఏఐజీ.. తెలుగు రాష్ట్రాల్లో తన మార్కెట్ వాటాను 2.1 శాతం నుంచి 3.6 శాతానికి పెంచుకుందని కంపెనీ హెడ్ (యాక్సిడెంట్, హెల్త్ క్లెయిమ్స్) రుద్రరాజు రాజగోపాల్ తెలిపారు. సమీప భవిష్యత్లో దీన్ని 5 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News
Updated Date – Apr 30 , 2025 | 06:09 AM