Natural Digestion Boosters: కొంతమందికి ఆహారం తిన్న తర్వాత కడుపులో భారంగా అనిపిస్తుంది. వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి నిత్యజీవితంలో భాగం కావడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. పోషకాహార లోపం, ఆహార అలెర్జీలు, మందులు లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. శరీరానిరి అవసరమైన పోషకాలు అందుకోవడం కష్టమై అలసట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తే మొత్తం ఆరోగ్యమే నాశనం అవుతుంది. అయితే, మందులతో పని లేకుండా సహజ మార్గాల్లోనే జీర్ణవ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. ఆ నేచురల్ టిప్స్ ఏవో తెలుసుకుందాం.
1) ఫైబర్
మీ ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలను చేర్చుకోండి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూవారీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకుంటే త్వరగా జీర్ణమయ్యేలా ప్రేరేపిస్తాయి. జీర్ణవ్యవస్థను చక్కదిద్ది శరీరంలోని మలినాలు బయటికి వెళ్లేందుకు తోడ్పడతాయి.
2) హైడ్రేటెడ్ గా ఉండండి
జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే రోజూ తగినంత నీరు తీసుకోవడం చాలాముఖ్యం. ఈ అలవాటు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
3) ఒత్తిడి
ఒత్తిడి జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి గట్టిగా ఊపిరి తీసుకోవడం లేదా ధ్యానం వంటి పద్ధతులను అనుసరించండి.
4) వ్యాయామం
శారీరక శ్రమ జీర్ణవ్యవస్థను పెంచుతుంది. పేగుల ద్వారా ఆహారం సాఫీగా వెళ్లి త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది.
5) ఆహారాన్ని బాగా నమలండి
ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అదే బాగా నమిలి తిన్నారంటే జీర్ణవ్యవస్థకు పని తగ్గుతుంది. కడుపుపై భారం పడదు .
6) నేచురల్ టీ
అల్లం, పుదీనా, చామంతి పూలలో జీర్ణక్రియను ప్రేరేపించే పదార్థాలు ఉంటాయి. సాధారణ టీ, కాఫీలకు బదులుగా వీటితో తయారుచేసిన టీ తాగితే జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది.
7) నిద్ర
జీర్ణక్రియ సరిగా జరగడానికే కాదు. ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. నిద్రపోవడానికి, మేల్కొనడానికి మధ్య నిర్దిష్ట సమయాలు పాటిస్తే సగం అనారోగ్య సమస్యలు తీరిపోతాయి.
8) చెడు ఆహారాలు
కొన్ని ఆహారాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా కొవ్వు పదార్ధాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు. అందుకే వీటిని ఇప్పటి నుంచే దూరం పెట్టండి.
Read Also: Foods To Avoid With Banana: ఈ 5 ఆహార పదార్థాలను అరటిపండ్లతో తింటున్నారా.. జాగ్రత్త ..
Trick To Know Good Eggs: గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో .. సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో ఇలా ట్రై చేయండి..
Kidney Problem: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా.. ఇంట్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..