నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని ఫడినగర్ కి చెందిన ఇఫ్ఫాత్ కౌసర్ అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 కి గాను 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్ డాక్టర్.శేక్.హమీద్ పాష ఆధ్వర్యంలో సంజీవనీ పెయిన్ రిలీఫ్ సెంటర్ సౌజన్యంతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శేక్.హమీద్ పాష మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఇఫత్ కౌసర్ నీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలన్నారు. దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు కోరారు. సమాజ సేవలో ముందుండి సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని వారు ఈ సందర్భంగా కోరారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు కోరారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని చదువు లేనిదే అభివృద్ధి కష్టమని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ క్రాస్ సొసైటీ పట్టణ కమిటీ డైరెక్టర్ యం.డి సుజావుద్దీన్,సంజీవని పెయిన్ రిలీఫ్ సెంటర్ యజమాని యం.డి సమీ అహ్మద్,ఎం.డి.శాడేం అహ్మద్,శ్రీనివాస్ చారి, అహ్మద్, పాల్గొన్నారు.
– Advertisement –