Naga Vamsi on Kubera: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో చాలామంది దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఆ సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘కింగ్డమ్’ సినిమాకి డివైడ్ టాక్ అయితే వచ్చింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది చర్చనీయంశంగా మారింది. ఈ రీసెంట్ గా నాగ వంశీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కింగ్డమ్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఈ రోజుల్లో ఏ సినిమా అయినా కూడా మొదటి రోజే పాజిటివ్ టాక్ ను సంపాదించుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జనాలు భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సినిమా కొంతమందికి నచ్చితే, ఇంకొంతమందికి నచ్చడం లేదు. కాబట్టి కింగ్డమ్ సినిమాకి కూడా అలాంటి టాక్ రావడంలో తప్పేమీ లేదు. నిదానంగా కలెక్షన్స్ పెరుగుతాయి అంటూ ఆయన చెప్పాడు. ఇక దాంతో పాటు నాగార్జున, ధనుష్ లు హీరోగా వచ్చిన కుబేర సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. కుబేర సినిమా కథ బాగుందని చాలామంది ఆకాశానికి ఎత్తారు. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం అలా జరగలేదు అంటూ ఆయన ఆ సినిమాని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు.
Also Read: కాసర్ల శ్యామ్ వల్ల తెలుగు పాటకి గౌరవం దక్కిందా..?
ఇక తమ సినిమా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టి భారీ రికార్డులను కొల్లగొడుతుందంటూ కామెంట్స్ అయితే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ వల్ల సినిమాకి హెల్ప్ అవుతుందా? లేదా మైనస్ అవుతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇదంతా చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం కుబేర సినిమాతో నీకేం పని ఆ కంటెంట్ చాలా గొప్పది. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఆ సినిమాతో మీ సినిమాని ఎందుకు పోలిస్తున్నారు అంటూ నాగవంశీ మీద ఫైర్ అవుతున్నారు.
Also Read: బెస్ట్ యాక్టర్స్ గా షారుక్ ఖాన్, విక్రాంత్ కి కాదు…ఈ నటుడికి ఇవ్వాలి…
మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ సినిమాకి మంచి బజ్ వచ్చింది. కానీ ఆ హైప్ ని వాడుకోవడంలో సినిమా కొంతవరకు వెనకబడిపోయిందనే చెప్పాలి. సినిమా ప్లాట్ గా ఉండడం ఒక్క హై మూమెంట్ కూడా ఉండకపోవడం వల్లే ఈ సినిమా చాలావరకు డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక విజయ్ రాబోయే సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే మంచింది…
Unanimous గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదు.. ఆ ఛాన్స్ జనం మనకు ఇవ్వట్లేదు #Kuberaa సినిమానూ అందరూ ఎత్తి ఆకాశాన పెట్టారు కథ బాగుంది అని కానీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అందరికి తెలుసు – ప్రొడ్యూసర్ #NagaVamsi #Kingdom #vijaydevarakonda pic.twitter.com/T5wBGFm5pe
— greatandhra (@greatandhranews) August 2, 2025