ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం.. బూత్ లెవల్ ఆఫీసర్ల జీతాలు డబుల్

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యే బూత్ లెవల్ ఆఫీసర్ల (Booth level officers) వేతనాన్ని ఎన్నికల కమిషన్ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈ రోజు ఎన్నికల సంఘం ఆదేశాలు (Election Commission) జారీ చేసింది. అందులో ” స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (EROS), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROలు), BLO సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOS)తో కూడిన ఓటర్ల జాబితా యంత్రాంగం చాలా కష్టపడి పనిచేస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, BLOS కోసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఓటర్ల జాబితాల తయారీ, సవరణలో పాల్గొన్న BLO సూపర్‌వైజర్ల వేతనాన్ని కూడా పెంచింది. చివరిసారిగా ఇటువంటి సవరణ 2015లో జరిగింది. అలాగే, మొదటి సారిగా EROS, AEROS లకు గౌరవ వేతనం అందించబడుతుందని ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజాగా కమిషన్ పెంచిన జీతాల వివరాలు కింద చూడవచ్చు

Leave a Comment