- లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
- ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్
- అంగద్ పేస్ ఎక్స్ ప్రెషన్స్‌పై ట్రోలింగ్
- నెటిజెన్లకు ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
జస్ప్రీత్ బుమ్రా నాలుగు కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ షమద్, ఆవేశ్ ఖాన్ వికెట్లు పడగొట్టిన బుమ్రా ముంబై విజయానికి బాటలు వేశాడు. ఇక కీలక వికెట్లు కోల్పోయిన లక్నో తమ ఓటమిని ముందే అంగీకరించింది. ఫలితంగా తమ ఖాతాలో ఐదో ఓటమి నమోదైంది. ఇది పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో బుమ్రాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన అతడి కొడుకు అంగద్‌పై కొందరు పనిగట్టుకుని ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. బుమ్రా బౌలింగ్‌కి లక్నో బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ వాంఖడే మైదానమంతా జస్ప్రీత్ నినాదంతో హోరెత్తింది. అయితే కొడుకు అంగద్ కాస్త నీరసంగా కనిపించిన కొన్ని క్లిప్స్ నెటిజన్లను ఆకర్షించాయి. దీంతో అంగద్ పేస్ ఎక్స్ ప్రెషన్స్‌పై కొందరు ట్రోలింగ్ చేశారు. డిప్రెషన్ వంటి పదాలను వాడుతూ అంగద్ ఫోటో వాడుకున్నారు. దీంతో బుమ్రా భార్య సంజన గణేశన్ విమర్శకులకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
మేము బుమ్రాను సపోర్ట్ చేసేందుకే వచ్చాము. మా బాబుని వైరల్ చేయడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘సెకన్ల పాటు ఉన్న క్లిప్‌లో అంగద్ కదలికలను బట్టి ఏదేదో రాస్తున్నారు. డిప్రెషన్ వంటి పదాలను వాడుతున్నారు. ఏడాదిన్నర బాబుపై ఇలాంటి పదాలను వాడటం బాధ కలిగించింది. మీ ఒపీనియన్స్ మీ దెగ్గర పెట్టుకోండి. ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ సంజన తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సంజన పోస్టుపై ముంబై ఫాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.