Minister Ponnam: ఆధార్ లాగ భూ భారతి వచ్చింది..

Written by RAJU

Published on:

హనుమకొండ: భూమి (Land) అంటే ఆత్మగౌరవం విశ్వాసం.. ఆ భూమికి సంబంధించిన సమస్య వస్తే పడే తిప్పలు రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దని భూ భారతి చట్టం (Bhu Bharati Act)లో కొత్త నిబంధనలు తీసుకొచ్చామని కాకతీయ కాలం నుంచి అనేక భూ సంస్కరణలు ఉన్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం హనుమకొండ, భీమదేవరపల్లి మండలం, ములకనూరు గ్రామంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూ భారతిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వంగర బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నో భూ సంస్కరణలు తెచ్చారని, గతంలో గ్రామంలో భూమి ఎవరిది అంటే చెప్పే పరిస్థితి నోటి మాట మీద ఉండేదని, తరువాత సాధాబైనమాలు.. రిజిస్ట్రేషన్‌లు వచ్చాయన్నారు.

Also Read: Guntur: ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ విచారణ వాయిదా..

ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు. గతంలో భూమి కొంటే పహాని అడిగేదాని, 2014 తరువాత పహాని లేదని.. దీంతో అనేక సమస్యలు వచ్చాయన్నారు. 30 ఏళ్ల క్రితం భూమి అమ్మిన భూస్వామి ధరణి తరువాత అదే భూమి ఆయన పేరు మీద వచ్చిందన్నారు. ధరణి వచ్చిన తరువాత 40 లక్షల భూ సమస్యలు వచ్చాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భూ పంచాయితీలు లేకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. భూమి విషయంలో అనేక పొరపాట్లు చేశారని..అనేక వేధింపులు జరిగాయని..ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. నిజమైన హక్కుదారుడికి భూమి వస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. గ్రామాల్లో భూమి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారని, ఇంకా ఏదైనా మంచి చెప్తే చేస్తామని అన్నారు. ‘భూ భారతి చట్టం రైతులకు చుట్టం’.. అని.. భూ సమస్యలు రాకుండా మీ శాసన సభ్యుడిగా మీ గౌరవాన్ని కాపాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు…

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date – Apr 28 , 2025 | 01:47 PM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights