ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులు – ముఖ్య తేదీలు
- ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు.
- రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- రూ. 1000 ఫైన్ తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 2000 ఆలస్య రుసుంతో మే 7వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
- రూ. 4000 ఫైన్ తో మే 12వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- రూ. 10 వేల ఆలస్య రుసుంతో మే 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు ఏర్పాటు చేయగా… హైదరాబాద్‌లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. మే 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని వెబ్ సైట్ లేదా వాట్సాప్(మన మిత్ర) ద్వారా పొందవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుతుంది. ప్రాథమిక కీ మే 21వ తేదీన విడుదలవుతుంది. మే 21 నుంచి 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.