Scholarship Scheme: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం

Written by RAJU

Published on:

తెలంగాణ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ కార్యాలయం-‘నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

అర్హత: విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. ఏడో తరగతిలో జనరల్‌ విద్యార్థులకు 55 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. ఎనిమిదో తరగతిలో కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు. తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ హై స్కూల్స్‌, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, గవర్నమెంట్‌ ఆశ్రమ్‌ హై స్కూల్స్‌, కస్తూర్బా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, నాన్‌ రెసిడెన్షియల్‌ మోడల్‌ స్కూల్స్‌, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌, సైనిక్‌ స్కూల్స్‌లో చదివే విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు.

రాత పరీక్ష వివరాలు: ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటిది మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(ఎంఏటీ), రెండోది స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎ్‌సఏటీ). ఒక్కో పార్ట్‌లో 90 చొప్పున మొత్తం 180 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఏడు, ఎనిమిది తరగతుల సిలబ్‌స ఆధారంగా సైన్సెస్‌, మేథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 180. పరీక్ష సమయం మూడు గంటలు. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 40 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం మార్కులు రావాలి.

స్కాలర్‌షిప్‌: రాత పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిది నుంచి ఇంటర్‌ పూర్తిచేసేవరకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12000 ఇస్తారు.

పరీక్ష ఫీజు: జనరల్‌, బీసీ విద్యార్థులకు రూ.100; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 13

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ కాపీని పాఠశాలలో సబ్మిట్‌ చేసేందుకు చివరి తేదీ: అక్టోబరు 16

డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌కు దరఖాస్తులు చేరాల్సిన తేదీ: అక్టోబరు 18

రాత పరీక్ష తేదీ: డిసెంబరు 10

వెబ్‌సైట్‌: http//bse.telangana.gov.in

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights