– Advertisement –
నవతెలంగాణ-హైదరాబాద్: 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని సీఎం కొనియాడారు.
ఎస్వీకే భవన్ వేదికగా ఇవాళ ‘నవ తెలంగాణ’ 10 వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథి హాజరవ్వగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఐఅండ్పీఆర్ ప్రత్యేక కమిషన్ ప్రియాంక్ తదితరలు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని కామెంట్ చేశారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. తనకు మొదటి నుంచి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు.
– Advertisement –