Drama Juniors Season 8: హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహిళా రోజా(Roja Selvamani). కొంతమంది ఈమెని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు, మరి కొంతమంది అయితే ఈమెకు నోటి దూల బాగా ఎక్కువ అని అంటుంటారు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది ఆమె. కానీ బయట తన గురించి ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్లే స్వభావం రోజా సొంతం. ఆమె ఎమ్మెల్యే గా కొనసాగుతున్నప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఉండేది. శాసనసభ్యురాలు అయ్యుండి కూడా రోజా తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేసి, వారం మొత్తం షూటింగ్స్ తోనే కాలయాపన చేస్తుంది అని అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించేవి. అయినప్పటికీ ఆమె పట్టించుకునేది కాదు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ షో కి దూరమైంది.
మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె జీ తెలుగులోని డ్రామా జూనియర్స్ సీజన్ 8 ప్రోగ్రాం కి న్యాయ నిర్ణేతగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమెతో పాటు ఈ షో లో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. దిగ్విజయంగా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న ఈ గేమ్ షోకి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గానే విడుదలై బాగా వైరల్ అయ్యింది. ఈ ప్రోమో లో మొగుడ్స్ వెర్సస్ పెళ్లామ్స్ అని ఆడపిల్లలు, మగపిల్లలు మధ్య ఒక కబడ్డీ పోటీ ని నిర్వహించారు. ఆడవాళ్ళ తరుపున రోజా కబడ్డీ పోటీ లో పాల్గొనగా, మగపిల్లల తరుపున అనిల్ రావిపూడి పోటీ లోకి దిగుతాడు. చివర్లో వీళ్లిద్దరి మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారు అనేది తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.
Also Read: రేపు ఓజీ, కూలీ చిత్రాల మధ్య పోటీ..గెలిచేది ఎవరు?
ఈ ప్రోమో ని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే రోజా ఇలా కబడ్డీ ఆడడం పై సోషల్ మీడియా లో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఉంటూ ఇంకా ఇవేమి ఆటలు?, రోజా నగరి నియోజకవర్గం 40 వేలకు పైగా ఓట్లతో చరిత్రలో ఎన్నడూ చూడని ఘోరమైన పరాజయం పొందింది. మళ్ళీ తన స్థానం పై పట్టు సాధించుకోవడం ఎలా అనేదానిపై ఆమె శ్రద్ద పెడుతుందని అనుకుంటే, ఓడిపోయిన వెంటనే టీవీ షోస్ లో కనిపించడం మొదలు పెట్టింది. ఈమె అసలు మారదు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం లేదా?, రోజా టీవీ షోస్ చేస్తే తప్పేంటి అంటూ సోషల్ మీడియా లో రోజా మద్దతుదారులు కౌంటర్లు వేస్తున్నారు.