HHVM political controversy: చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరిస్థితి. లేనిపోని వివాదాలను తెచ్చుకోవడం ఆ పార్టీకి ఉన్న అలవాటైన విద్య. ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జోలికి వెళ్లి అనవసర హైప్ సృష్టించింది. కాపుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెళ్లడంతో ఈ సినిమాపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టు కొనసాగుతూ వస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలను తీసుకున్నారు. అయితే గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సినిమాను పూర్తి చేశారు. అయితే ఇదో హిస్టారికల్ మూవీ. ఈ సినిమా విషయంలో జాప్యం జరగడంతో అనుకున్న ప్రచారం రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు బయటకు వచ్చి ప్రమోషన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Also Read: పాప ఫుల్ మూవీ రివ్యూ…
బలమైన సోషల్ మీడియా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సోషల్ మీడియా( social media) ఉంది. ఆపై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి వారంతా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకిస్తుంటారు. పవన్ వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న అనుమానం వారిలో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన వ్యతిరేక భావనతో ఉంటారు. పవన్ విషయంలో ఏమాత్రం అవకాశం చిక్కినా విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేయరు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యింది. దానిపై నెగిటివ్ ప్రచారం చేయాలని భావించారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆ నెగిటివ్ ప్రచారం తోనే.. సినిమాకు ఎనలేని ప్రాధాన్యం దక్కేలా చేశారు. ప్రజల్లో ఈ అంశం బలంగా వెళ్లడంతో సినిమాలో ఏం ఉందని చూసినవారు ఉన్నారు. దీంతో ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది.
తప్పిన అంచనా..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా మరోసారి తప్పింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా వెళ్లకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. పవన్ రాజకీయ వైఖరిలో ఎటువంటి మార్పులు లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెచ్చగొట్టినా.. పరోక్ష ప్రయత్నాల ద్వారా టిడిపి తో స్నేహాన్ని దెబ్బతీయాలని చూసినా పవన్ చలించడం లేదు. అంతకుమించి ఎక్కువగా ప్రకటనలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వమని తేల్చి చెబుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో వ్యతిరేకంగా కానీ.. సానుకూలంగా ఉండడం కానీ చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే పవన్ ట్రాప్ లో వైసీపీ పడినట్లు అయింది. హరిహర వీరమల్లు సినిమాకు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా.. ఆ సినిమా మాత్రం వసూళ్లపర్వంగా అనుకున్నది సాధించగలిగింది.
Also Read: మహేష్ బాబు – పూరి జగన్నాథ్ మధ్య వైరానికి కారణం వాళ్లేనా..?
ఎవరూ మాట్లాడొద్దని ఆదేశం..
అయితే ఇప్పుడు తీరిగ్గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక సమాచారం పార్టీ శ్రేణులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాపై నెగిటివ్ మాట్లాడవద్దని పార్టీ హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను టార్గెట్ చేయడంతో తమ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని.. కాపులు మరింతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని.. వైసీపీలో ఉన్న కాపు నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకే హరిహర వీరమల్లు సినిమాపై ఎవరూ మాట్లాడవద్దని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం ద్వారా కాపు సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉంది. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినా ఊరికే ప్రయోజనాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.