Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌‌లో జాబ్స్! నోటిఫికేషన్ విడుదల

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Jan 01 , 2024 | 05:27 PM

అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్, రైఫిల్‌ఉమెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈసారి మొత్తం 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేజీ జనవరి 28.

Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌‌లో జాబ్స్! నోటిఫికేషన్ విడుదల

అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్, రైఫిల్‌ఉమెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఉద్యోగానికి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు assamrifles.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ జనవరి 28. ఇక మార్చి 4న అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. లైట్‌కోర్, షిల్లాంగ్, ఎన్ఆర్ఎస్-గువహటీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కారుణ్య నియామకాల కింద దరఖాస్తు చేసుకునే వారికి రాత పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.

ఖాళీలు ఇవీ..

ఈ నోటిఫికేషన్‌తో మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాలూ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు, డోమిసైల్ సర్టిఫికేట్లు, డిప్లొమా/టెక్నికల్/ఐటీఐ సర్టిఫికేట్ల సెల్ఫ్-అటెస్టె్డ్ కాపీలను పోస్ట్‌లో పంపించాలి.

దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్

Address- Directorate General Assam Rifles

(Recruitment Branch)

Lightcore, Shillong

Meghalaya- 793010

Updated Date – Jan 01 , 2024 | 05:58 PM

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights