Israeli Prime Minister Benjamin Netanyahu calls Modi.

Written by RAJU

Published on:

  • ప్రధాని మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని మోడీ..
  • దాడిపై చర్చించిన బెంజమిన్ నెతన్యాహూ..
Israeli Prime Minister Benjamin Netanyahu calls Modi.

Netanyahu: ప్రధాని నరేంద్రమోడీకి, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్ని, వారి మద్దతుదారుల్ని న్యాయం ముందు నిలబెట్టాలనే భారతదేశ దృఢ సంకల్పానికి ఇజ్రాయిల్ మద్దతుగా నిలిచింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత దేశానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.

Read Also: Kurnool: రెండవ అంతస్తు నుంచి దూకిన మెడికో.. ఐసీయూలో చికిత్స

బుధవారం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సాంకేతికత, పద్దతి మరియు నిఘా వంటి రంగాలలో భారతదేశానికి నిరంతర సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు, ఈ రోజు తెల్లవారుజామున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ ఫోన్ చేసి, సంఘీభావం ప్రకటించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights