Outcomes: అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

Written by RAJU

Published on:

ఐబీపీఎస్ ఎస్ఓ 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ibps.inలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రిజల్స్ట్ విడుదల అయినట్లు ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ద్వారా ఫలితాలను చూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. జనవరి 28న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఫలితాలు ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు స్కోర్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా సెర్చ్ బార్ లో https://www.ibps.in/ అధికార వెబ్ సైట్ కి వెళ్లాలి. హోమ్‌పేజీలో CRP SPL-XIII పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త ఫలితాల పేజీ ప్రత్యక్షమవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్కోర్ కనిపిస్తుంది. దానిపైన ఉండే మూడు గీతలను ట్యాప్ చేయడం ద్వారా సేవ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఐబీపీఎస్ ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా ఐటీ ఆఫీసర్ (స్కేల్-I), అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I), రాజభాష అధికారి (స్కేల్ I), లా ఆఫీసర్ (స్కేల్ I), హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I) వంటి విభాగాల్లో 1,420 ఖాళీల భర్తీకి అధికారులు పరీక్ష నిర్వహించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights