- భారత్ సమ్మిట్.. శాంతి, సమానత్వం, ఆర్థికతపై చర్చల వేదిక
- 100 దేశాల ప్రతినిధులతో తెలంగాణకు గ్లోబల్ గుర్తింపు
- పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన, భద్రతపై దృష్టి : భట్టి

Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదుపరి నిర్వహించనున్న భారత సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మిట్‌లో శాంతి, అహింస, ఆర్థికం, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన తెలిపారు. భారత్ సమ్మిట్‌ని కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలను ప్రతిబింబిస్తూ నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలకు చెందిన నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారని భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ స్థాయిలో కీలకమైన అంశాలను చర్చించే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారని, ఇది తెలంగాణకు గర్వకారణంగా ఉంటుందన్నారు భట్టి. ఈ సమ్మిట్ నిర్వహించడం తెలంగాణకు గొప్ప అదృష్టమని భట్టి విక్రమార్క అన్నారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భట్టి విక్రమార్క.. ఈ దాడి నుండి ప్రపంచానికి చెందిన ప్రతి ఒక్కరు నిస్సహాయంగా బాధ పడుతున్నారని మనం గుర్తించాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్ నిర్వహించడం తెలంగాణకు గొప్ప గౌరవమని, హైదరాబాద్‌కు గ్లోబల్ లెవల్ ఇమేజ్ వస్తోందని చెప్పారు. భారత్ సమ్మిట్ అనేది చారిత్రాత్మక కార్యక్రమమని, 100 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం చారిత్రాత్మకమైన విషమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
భారత్ సమ్మిట్ ప్రధానంగా.. శాంతి, అహింస, ఆర్థికం, సమానత్వం పై చర్చలు జరుగనున్నాయి. వివిధ దేశాలకు చెందిన నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు సమ్మిట్‌లో పాల్గొంటారు. ఈ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురానుంది
Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ‘ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్’ నమోదు