HM Amit Shah calls on President Murmu to apprise on Pahalgam terror assault

Written by RAJU

Published on:

  • రాష్ట్రపతిని కలిసిన అమిత్ షా, జైశంకర్..
  • ద్రౌపది ముర్ము ముందు ‘‘రెడ్ ఫైల్’’..
HM Amit Shah calls on President Murmu to apprise on Pahalgam terror assault

Amit Shah: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై యావత్ దేశం తన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ ఉగ్రవాద దాడి గురించి గురువారం వీరిద్దరు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతికి వివరించారు.

Read Also: Surya Kumar Yadav: సూరీడు నువ్వేం మారలేదు.. మరోసారి అభిషేక్ జేబులు చెక్ చేసిన స్కై!

ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధం ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రమేయం ఈ దాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ జోక్యానికి తగిన ఆధారాలను ఇప్పటికే మన ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించాయి. మరోవైపు, భారత ప్రభుత్వం విదేశీ దౌత్యవేత్తలకు దాడి గురించి వివరాలను అందించింది. పాకిస్తాన్ ప్రమేయం గురించిన ఆధారాలను కూడా వారి ముందుంచింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు జర్మనీ, జపాన్, పోలాండ్, యుకె, రష్యా సహా 20 కి పైగా దేశాల రాయబారులకు వివరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా, రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతిని కలవడంతో ఏదో పెద్దగా జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సమావేశానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు, రాష్ట్రపతి ముందు ‘‘రెడ్ ఫైల్’’ ఉంచారు. ఇప్పుడు ఈ రెడ్ ఫైల్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఏముందనే విషయం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్‌పై ఏదైనా సైనిక చర్య ఉంటుందా..? మరేదైనా చర్య తీసుకుంటారా..? అని అంతా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights