కామెంటరీ లేకుండా క్రికెట్ మ్యాచ్‌లను అసలు ఊహించలేం. నిజం చెప్పాలంటే మ్యాచ్‌కు ప్రాణం పోసేది కామెంటరీనే. ప్లేయర్లు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపిస్తుంటారు కామెంటేటర్లు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్- 2025లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. టీమిండియా నుంచి సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్ తదితరులు కామెంటేటర్లుగా ఉన్నారు. మరి.. వీళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? ప్రస్తుతం సీజన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కామెంటేటర్ ఎవరు? అలాగే హిందీ, ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళ్ తదితర రీజియన్ లాంగ్వేజుల్లో కామెంట్రీ చేసే సీనియర్, జూనియర్ల జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి.
సన్నీనే టాప్ ..
ప్రస్తుతం భారత్ లో సునీల్ గావస్కర్ అత్యధికంగా ఇంగ్లిష్ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత రవి శాస్త్రి, హర్షా భోగ్లే కూడా సుమారు 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరి ఐపీఎల్-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్-10 కామెంటేటర్లు వీరే..
1. సునిల్ గవాస్కర్ (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు
ఇవి కూడా చదవండి
2. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు
3. కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు
4. ఇయాన్ బిషప్ (వెస్టిండీస్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు
5. హర్షా భోగ్లే (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.1 కోట్లు
6. రవిశాస్త్రి (భారత్)- ఇంగ్లిష్- రూ. 4 కోట్లు
7. ఆకాశ్ చోప్రా (భారత్)- హిందీ- రూ. 2.92 కోట్లు
8. సంజయ్ మంజ్రేకర్ (భారత్)- హిందీ- రూ. 2.8 కోట్లు
9. సురేశ్ రైనా (భారత్)- హిందీ- రూ. 2.5 కోట్లు
10. హర్భజన్ సింగ్ (భారత్)- హిందీ- రూ. 1.5 కోట్లు
11. జతిన్ సప్రూ (భారత్)- హిందీ- ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.5 లక్షల చొప్పున
1. ఇంగ్లిష్- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షల రెమ్యునరేషన్ ఉండగా, జూనియర్లకు రూ. 35 వేల చొప్పున ఉంటుది.
2. దీ- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పున రెమ్యునరేషన్ ఉంటుంది.
3. తెలుగు లేదా తమిళ్ ఇతర ప్రాంతీయ భాషలు- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పున పారితోషికాలు ఉంటాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..