- కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా హాట్ టాపిక్
- స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
- కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు సంఘీభావం.

Danam Nagendar: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ మహాసభపై రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏమి మాట్లాడతారన్న విషయం పై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఇకపోతే, కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ పట్ల దానం నాగేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె రీట్వీట్ చేసిన విషయాల్లో తప్పేమీ లేదని, ఆమె అక్కడి వాస్తవ పరిస్థితినే ప్రజలతో పంచుకున్నారని అన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశించి ఆమె ఏమి అనలేదని, ఆమెపై విమర్శలు అనవసరమని ఆయన స్పష్టం చేస్తూ సంఘీభావం తెలిపారు.