- పాక్ జాతీయులకు వీసాలు రద్దు..
- ఏప్రిల్ 27 వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం..
- ఏప్రిల్ 29 వరకు మాత్రమే మెడికల్ వీసాలు..
- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు..

Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
Read Also: Vijay Deverakonda: ఇది నా ప్లేస్, వీళ్లంతా నా వాళ్లు!
వీసా సేవల్ని భారత్ పూర్తిగా నిలిపేసింది. ‘‘”భారతదేశం పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలను ఏప్రిల్ 27, 2025 నుండి రద్దు చేసింది. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన వైద్య వీసాలు 29 ఏప్రిల్ 2025 వరకు మాత్రమే చెల్లుతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీ జాతీయులు వీసాల గడువు ముగిసేలోపు భారతదేశం విడిచి వెళ్లాలి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.