- సాయంత్రం 6గంటలకు అఖిలపక్ష భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ

కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పార్లమెంట్ అనెక్స్‌లో ఈ భేటీ జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు.. నేతలకు వివరించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్ సభలో పాల్గొన్న మోడీ
ఇక అమెరికా పర్యటనలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హుటాహుటినా ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనను కుదించుకుని భారత్‌కు వచ్చేశారు. ఇక గురువారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పహల్గామ్ మృతులకు సంతాపం తీర్మానం చేసింది.
మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఇక మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ నుంచి టూరిస్టులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఉగ్ర దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. చిక్కుకున్న టూరిస్టులకు 15 రోజులు ఉచిత బస కల్పిస్తామని హోటళ్లు ముందుకొచ్చాయి.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సంబరాలు.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి (వీడియో)
ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రధాని మోడీ తొలిసారి గురువారం బీహార్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశమంతా దు:ఖంలో మునిగిపోయిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది మహిళలు.. తమ భర్తలను కోల్పోయారని.. వారందరికీ దేశమంతా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నామని.. వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టమని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: TG Govt : అలర్ట్.. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్