- బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్
- కొనసాగుతున్న భారీ కాల్పులు
- ఒక ఆర్మీ జవాను వీరమరణం
- 24 గంటల్లో జరిగిన మూడవ ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఉధంపూర్‌లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో జరిగిన మూడవ ఎన్‌కౌంటర్ ఇది. అంతకుముందు.. కశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
READ MORE: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రదాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం పహల్గాంలో సైనిక దుస్తువుల్లో వచ్చిన ఉగ్రవాదులు పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అమాయకుల ప్రాణాలు తీసి వారి ఉసురు పోసుకున్నారు. ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ మారణహోమాన్ని ప్రత్యక్షంగా చూసిన మృతుల కుటుంబాల బాధ వర్ణనాతీతం. అసలైన సైనికులను చూసినా భయంతో వణికిపోతున్నారు.
READ MORE: Pahalgam Terror Attack: భారత్‌కు అమెరికా మాజీ అధికారి కీలక సూచన
#OpBirliGali
Based on specific intelligence, a joint operation with @JmuKmrPolice was launched today in #Basantgarh, #Udhampur.
Contact was established and a fierce firefight ensued.One of our #Bravehearts sustained grievous injuries in the initial exchange and later succumbed… pic.twitter.com/eojsj5PPuU
— White Knight Corps (@Whiteknight_IA) April 24, 2025