Minister Srinivas: నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 24 , 2025 | 11:14 AM

Minister Srinivas: నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రబుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసులు అన్నారు.

Minister Srinivas: నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం

Minister Kondapalli Srinivas

కడప : ఎంఎస్ఎం ఈ పార్కుపై అపోహలు వద్దని.. కడప జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) స్పష్టం చేశారు. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సూచించారని అన్నారు. ఇవాళ (గురువారం) కడప జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 20 ఎకరాల ఐటీ పార్కు కోసం స్థల పరిశీలన చేస్తున్నామని మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పార్క్‌లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఎలాంటి పరిశ్రమలకు కేటాయించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాల గురించి చర్చించడానికి కడపకు వచ్చానని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కును అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కడప జిల్లాలో భారీ కంపెనీలు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృతదేహం..

For More AP News and Telugu News

Updated Date – Apr 24 , 2025 | 11:19 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights