- భారత్‌కు అమెరికా మాజీ అధికారి కీలక సూచన
- హమాస్‌పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసినట్లుగా పాక్‌పై చేయాలని సలహా

పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. ఐఎస్ఐతో సహా దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలని సూచించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టడం వల్లే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిందని తెలిపారు. దివంగత ఒసామా బిన్ లాడెన్‌కు అసిమ్ మనీర్‌కు పెద్ద తేడా లేదన్నారు. లాడెన్ గృహలో దాక్కుంటే.. అసిమ్ రాజగృహంలో ఉంటున్నాడని చెప్పారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vinay Narwal: భార్యతో ఆర్మీ ఆఫీసర్ డ్యాన్స్.. చివరి వీడియోలు వైరల్
అక్టోబర్ 7న యూదులకు వ్యతిరేకంగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో హిందువులకు వ్యతిరేకంగా దాడి చేశారని రూబిన్ గుర్తుచేశారు. అప్పటికీ.. ఇప్పటికీ పెద్ద తేడా లేదని.. ఇజ్రాయెల్‌పై జరిగినట్లుగానే.. భారత్‌పై జరిగిందని పేర్కొన్నారు. హమాస్‌పై ఐడీఎఫ్ దళాలు ఎలా దాడి శాయో.. ఇప్పుడే అదే మాదిరిగా భారత్ కూడా చేయాల్సిందేనన్నారు. ఐఎస్ఐను పూర్తిగా భారత్ నాశనం చేయాలని కోరారు.
హహల్గామ్‌లో మంగళవారం మధ్యా్హ్నం జరిగిన మారణహోమంలో మొత్తం 28 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో రావడంతో పర్యాటకులు గుర్తించలేకపోయారు. దీంతోనే భారీ నష్టం జరిగిపోయింది.
ఇది కూడా చదవండి: TG Govt : అలర్ట్.. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్